Mangal Gochar 2022: మిథునరాశిలో కుజుడి సంచారం.. నెలరోజుల్లో ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..
Mangal Gochar 2022: గ్రహాల కమాండరైన కుజుడు మిథునరాశిలో సంచరించాడు. దీంతో కొన్ని రాశులవారు నెలరోజులపాటు అపారమైన లాభాలను పొందనున్నారు.
Mangal Gochar 2022: ధైర్యం, శక్తి, భూమి, వివాహానికి కారకుడైన కుజుడు నిన్న మిథునరాశిలో సంచరించాడు. నవంబరు 13 వరకు అదే రాశిలో ఉంటాడు. జెమినిలో అంగారకుడి సంచారం (Mars transit in Gemini 2022) మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అంటారు. ఎవరి జాతకంలో అంగారకుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికీ దేనికీ లోటు ఉండదు. కుండలిలో కుజుడు అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. మిథునరాశిలో అంగారక సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి (Aries)- కుజుడు సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
సింహం (Leo)- కుజుడు రాశి మార్పు వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
కన్య (Virgo)- కుజుడు రాశిచక్రంలో మార్పు కన్య రాశి వ్యక్తుల వృత్తి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. ప్రమోషన్ పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఇంట్లో అందరితో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
మకరం (Capricorn)- అంగారక గ్రహ సంచారం మకరరాశి వారి కెరీర్ లో పురోగతిని ఇస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. బిజినెస్ విస్తరిస్తుంది. డబ్బు రావడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి.
మీనం (Pisces)- మీన రాశి వారికి జీవితంలో ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. కొత్త ఒప్పందాల వల్ల వ్యాపారం విస్తరిస్తుంది. అంతేకాకుండా బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు.
Also Read: Surya Gochar 2022: తులరాశిలో సూర్యుడి సంచారం...ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook