Mars Transit 2023: మంగళ గ్రహ గోచారం ప్రభావం, మార్చ్ 13 నుంచి ఈ 5 రాశులకు వద్దంటే డబ్బు, పదోన్నతి, వ్యాపారంలో లాభాలు
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. అదే సమయంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా ఇతర రాశులపై ఆ ప్రభావం పడుతుంది.
Mars Transit 2023: జ్యోతిష్యం ప్రకారం కళ్యాణ దేవతగా పిల్చుకునే మంగళ గ్రహం మార్చ్ 13వ తేదీన మిధు రాశిలో గోచారం చేయనుండటంతో ఆ ప్రభావం ముఖ్యంగా 5 రాశులపై పడనుంది. మంగల గ్రహం రాశి పరివర్తనంతో ఈ 5 రాశులవారిపై ఊహించని ధనవర్షం కురవనుంది.
హిందూ జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఏదైనా గ్రహం రాశి మారినప్పుడు ఆ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకైతే అదృష్టమే మారిపోతుంది. కొన్ని రాశులకు ఊహించని నష్టం కలుగుతుంది. కళ్యాణదేవతగా భావించే మంగళ గ్రహం మార్చ్ 13వ తేదీ ఉదయం 5 గంటల 47 నిమిషాలకు మిధున రాశిలో ప్రవేశించనుంది. అంతకుమందు ఈ గ్రహం ఇదే రాశిలో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 , 2022 వరకూ ఉంది. అంటే చాలా తక్కువ సమయమే. ఫలితంగా పెద్దగా లాభం కలగలేదు కొన్ని రాశులకు. అయితే ఈసారి 5 రాశులపై ఆ ప్రభావం అద్భుతంగా ఉండనుంది. ఈ 5 రాశుల జాతకులు చాలా చాలా అదృష్టవంతులని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.
మంగళ గ్రహం గోచారంతో ఏయే రాశులపై ప్రభావం
తులా రాశి
మంగళ గ్రహం గోచారం ప్రేమ వ్యవహారాలకు అనుకూలం కానుంది. తులా రాశి జాతకుల ప్రేమ కొనసాగి పెళ్లివరకూ దారితీస్తంది. భాగస్వామిని కుటుంబసభ్యులకు పరియం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు మొగ్గు చూపుతారు. మీ కుటుంబం లేదా జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా తీర్ధయాత్ర చేయవచ్చు.
మకర రాశి
మంగళ గ్రహం గోచారం ప్రభావం మీ ఆరోగ్యంపై సానుకూలంగా ఉంటుంది. అంటే పాత రోగాల్నించి విముక్తి పొంది ఆరోగ్యంగా ఉంటారు. మీ ప్రత్యర్ధులు మీకు నష్టం కల్గించేందుకు ప్రయత్నించి విఫలమౌతారు. మీ పనితీరు మరింత మెరుగుపడుతుంది. పని వ్యవహారమైన విదేశాలకు వెళ్లవచ్చు.
వృషభ రాశి
మంగళ గ్రహం గోచారంతో ఇంజనీరింగ్, ఇతర సాంకేతీక రంగాల్లోని వారికి పూర్తిగా లాభం కలుగుతుంది. ఈ రాశి జాతకులు మంచి ర్యాంకు పొందడంలో సక్సెస్ అవుతారు. మీరు మీ భాగస్వామితో కలిసి ధన సంపదలు పెంచగలరు. మీకు మీ తల్లిదండ్రులు, గురువుల తోడు పూర్తిగా లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.
సింహ రాశి
మంగళ గ్రహం గోచారంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులపై లాభాలు ఆర్జిస్తారు. భవిష్యత్ ఆర్ధిక ప్రణాళికలు ప్రారంభించేందుకు అనువైన సమయం. మీ జీతం పెరుగుతుంది. పనిచేసే చోట బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్లానింగ్ కారణంగా డబ్బులు ఆదా అవుతాయి.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు ధన సంపద కూడబెట్టేందుకు లేదా ఆస్థుల కొనుగోలుకు అనువైన సమయం. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. మీరు తీసుకునే అన్ని నిర్ణయాలకు సంపూర్ణ సహకారం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది.
Also read: Sun transit 2023: మార్చ్ 16 న బుధాదిత్య రాజయోగం, ఆ మాడు రాశులకు ఇక తిరుగులేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook