Mars Transit 2023: ఆగస్టు 18 వరకు ఈ రాశులవారి జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇందులో మీ రాశి కూడా ఉందా?
Mangal Rashi Parivartan 2023: కుజుడు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల చాలా రాశులవారి జీవితాల్లో త్వరలోనే మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింది రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
Mangal Rashi Parivartan 2023: కుజుడు జూలై 1న సింహరాశిలోకి సంచారం చేసింది. ఆగస్టు 18 వరకు ఈ రాశిలో ఉండబోతోంది. ఆ తర్వాత ఆగస్టు 18న కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఓ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ క్రమంలో మత్స్య యోగంతో పాటు విష్ణు యోగం కూడా ఏర్పడుతుంది. వీటి వల్ల కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో చాలా రాశులవారు ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఇదే క్రమంలో శని, అంగారకుడు, రాహువు గ్రహాలు కూడా కలుస్తాయి. దీంతో ఆగస్టు 18న ఈ కింది రాశులవారు భారీ లాభాలు పొందుతారు. ఏయే రాశులవారికి ఈ యోగాల కారణంగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:
కుజుడు సంచారంతో ఏర్పడే యోగాల కారణంగా వ్యాపారాల్లో చాలా మార్పులు సవ్తాయి. అంతేకాకుండా వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం భారీ లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటిస్తూ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మేష రాశివారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగ్యాల్లో ప్రత్యర్థులపై విజయం సాధించడమే కాకుండా ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
ధనుస్సు రాశి:
ఈ ప్రత్యేక యోగాల కారణంగా వృత్తి జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయి. అంతేకాకుండా చేతి వృత్తులు జీవితం గడుపుతున్నవారికి ఈ క్రమంలో భారీ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ క్రమలంలో సులభంగా పొందుతారు. ధనుస్సు రాశి వారు ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కరమవుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ క్రమంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సింహ రాశి:
ఆగష్టు 18 వరకు సింహ రాశి ఈ ప్రత్యేక యోగాల కారణంగా కలిసి వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు కొత్త ఆస్తులు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రమోషన్స్‌తో పాటు జీతాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి