Mangal Gochar In Mithun Rashi 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ధైర్యాన్ని ఇచ్చే అంగారుకుడు ఇవాళ అంటే మార్చి 13న మిథునరాశిలోకి ప్రవేశించాడు. కుజుడి రాశి మార్పు వల్ల కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారక సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం
కుజుడు రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి మూడవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు విదేశీ వ్యాపారం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించగలరు. స్థిరాస్తి వ్యాపారం చేసేవారు మంచి  లాభాలను పొందుతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
కన్య రాశిచక్రం
మార్స్ యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలోని కర్మ గృహంలో కుజుడు సంచరించనున్నాడు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వ్యాపారులు మంచి ఆర్డర్‌లను పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఈసమయంలో వివాదాలకు దూరంగా ఉండండి. 
సింహ రాశి
అంగారకుడి సంచారం సింహరాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి 11వ ఇంట్లో జరగబోతోంది. మీరు పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. మీరు స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 


Also Read: Panch Mahayog: ఏడు శతాబ్దాల తర్వాత పంచ మహాయోగం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook