Mars Transit 2024: 45 రోజుల తర్వాత అంగారకుడిలో మార్పులు.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే!
Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందితే, మరికొన్ని రాశుల వారు మాత్రం వ్యాపారాల్లో దూసుకు వెళ్తారు. అయితే ఈ అంగారక సంచార ప్రభావం మీ రాశిపై కూడా పడుతుందా?
Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహాన్ని ధైర్యం, కోపం, ఆస్తి, సంతోషానికి సూచికగా భావిస్తారు. అందువల్ల ఈ గ్రహం ఎప్పుడూ సంచారం చేసిన కొన్ని రాశులు ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ అంగారక గ్రహం దాదాపు 45 రోజుల తర్వాత మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు కలిగితే, మరికొన్ని రాశుల వారికి మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ అంగారక గ్రహం మేషరాశి లోకి సంచారం చేయడం కారణంగా వృత్తి వ్యాపార జీవితాలు కొనసాగిస్తున్న వారికి అనేక మార్పులు వస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారిపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ అంగారక గ్రహ సంచారంతో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
కర్కాటక రాశి:
ముఖ్యంగా ఈ అంగారక సంచారం కారణంగా కర్కాటక రాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ రాశి వారికి అంగారకుడు అదృష్టాన్ని రెట్టింపు చేయడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతున్నాడు. ముఖ్యంగా అంగారక సంచారంతో ఈ రాశి వారికి వ్యాపార జీవితంలో అనేక మార్పులు వచ్చి కాస్త మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ లభిస్తాయి. అలాగే పూర్వికుల నుంచి కూడా ఆస్తులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఇక ఈ సమయంలో తండ్రి సపోర్టు లభించి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు.
ధనస్సు రాశి:
అంగారకుడు సంచారం ధనస్సు రాశి వారి జాతకంలో ఐదవ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పిల్లలనుంచి కూడా మంచి శుభవార్తలను వింటారు. దీంతోపాటు ప్రేమ జీవితం కొనసాగిస్తున్న వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కోరికలు నెరవేరడమే కాకుండా భాగస్వామ్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని శుభవార్తలు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రశంసలు లభించి జీవితాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఎప్పటినుంచి అనుకుంటున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మేష రాశి:
మేషరాశి వారికి కూడా అంగారకుడి సంచారం ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శుభస్థానంలో అంగారకుడు సంచారం చేయబోతున్నారు. దీంతో వీరు ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. అలాగే సంపాదనలో మార్పులు వచ్చి విపరీతమైన లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి కొంతకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఎప్పటినుంచో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి మంచి ఒప్పందాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడతాయి. అలాగే ఇతరుల నుంచి కూడా మీరు అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. ఇక భాగస్వామ్య జీవితం గడిపే వారికి ఈ సమయం చాలా మధురంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి