Mars Transit 2024: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహాన్ని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. సూర్యుడిని గ్రహాల రారాజుగా, బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా, శని గ్రహాన్ని న్యాయదేవతగా భావిస్తుంటారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని సేనాపతిగా పరిగణిస్తారు. అందుకే మంగళ గ్రహం గోచారం జాతకరీత్యా చాలా కీలకమైంది. మంగళ గ్రహం జాతకరీత్యా వివిధ అంశాలకు ప్రతీకగా నిలుస్తుంది. మరో 8 రోజుల్లో మంగళ గ్రహం రాశి మారనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళ గ్రహం అక్టోబర్ 20వ తేదీన అంటే మరో 8 రోజుల్లో రాశి మారనుంది. కర్కాటక రాశిలో ప్రవేశించనుంది. మంగళ గ్రహం అంటే సాహసం, పరాక్రమం, ఎనర్జీ, సోదరభావం ఇలా వివిధ అంశాలకు ప్రతీక. దాంతో జాతకం ప్రకారం ఈ గ్రహం రాశి పరివర్తనం కీలకమైంది. అక్టోబర్ 20న కర్కాటక రాశిలో ప్రవేశించనుండటంతో 3 రాశులకు దశ మారిపోనుంది. 3 రాశులకు మహర్దశ పట్టనుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆదాయం పెరగనుంది. ఈ మూడు రాశుల జీవితంలో ఊహించని మార్పు సంభవించవచ్చు. 


కుంభ రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారంతో అత్యంత శుభప్రదం కానుంది. ఆాకశ్మిక ధనలాభం కలగనుంది. ఆరర్దికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఉద్యోగులకు పదోన్నతి లభించడంతో పాటు వేతనం పెంపు కూడా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్ధులకు విజయం లభించవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధిత వ్యవహారాలు బాగుంటాయి. ఎలాంటి ఇబ్బందులున్నా దూరం కావచ్చు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.


మంగళ గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనుండటంతో అక్టోబర్ 20 నుంచి మేష రాశి జాతకులకు ఊహించని మార్పు కలగనుంది. ఊహించని సంపద వచ్చి పడుతుంది. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. వేతనం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయం. గతంలో ఎప్పుడైనా ఎక్కడైన నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. 


మంగళ గ్రహం రాశి మారడంతో తులా రాశి జీవితంలో అత్యంత కీలకం కానుంది. ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తుతుంటే అవి దూరమౌతాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి అనువైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో మంచి పరిణామాలు ఎదురుకావచ్చు. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సరైన సమయం. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సైతం మంచి సమయం. కుటుంబ సంబంధాలు చాలా పటిష్టంగా ఉండవచ్చు.


Also read: Flipkart Sales: 108MP కెమేరా, ప్రీమియం ఫీచర్లతో రియల్ మి ఫోన్ కేవలం 13 వేలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.