Mars Transit 2022:  భూమి, ధైర్యం, బలం, వివాహం, సోదరుడు అనే అంశాలకు కారకుడు అంగారకుడు. కుజ గ్రహం జూన్ 27న తన రాశిచక్రాన్ని (Mars Transit in Aries 2022) మార్చబోతున్నాడు. జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహాన్ని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. కుజుడు మేష, వృశ్చిక రాశికి అధిపతి. జూన్ 27న కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల అన్ని రాశులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే అంగారక సంచారం 4 రాశుల వారికి మాత్రం శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini) - కుజుడు సంచారం వల్ల మిథునరాశి వారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వారి బాధ్యతలు పెరుగుతాయి. ధనం పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వర్గానికి ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా లాభిస్తుంది. తండ్రి సహకారం ఉంటుంది. భార్యాభర్తల జీవితంలో సంతోషం ఉంటుంది.


కర్కాటకం (Cancer)- కర్కాటక రాశి వారికి మేషరాశిలో కుజుడు ప్రవేశించడం చాలా శుభప్రదం. వారు డబ్బు పొందుతారు. ధైర్యం పెరుగుతుంది. కెరీర్‌కు ఇది మంచి సమయం అవుతుంది. కుటుంబంలో సంతోషం మరియు సహకార వాతావరణం ఉంటుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైనది. కష్టపడి పనిచేయండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.


వృశ్చికం (Scorpio)- కుజుడు సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. దీని ఆధారంగా ప్రతి పనిని సులువుగా పూర్తి చేసుకుంటూ వెళ్తారు. వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది, ఇది ఆనందాన్ని ఇస్తుంది. తగినంత ధనాన్ని పొందడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.


ధనుస్సు (Sagittarius)- అంగారక సంచారం ధనుస్సు రాశి వారికి చాలా సందర్భాలలో ప్రయోజనాలను ఇస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా కాలం తరువాత మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. వీరికి స్నేహితుల సహకరం లభిస్తుంది.


Also Read: Mercury transit 2022: మిధునంలో బుధుడు, జూలై 2 నుంచి అదృష్టం పూర్తిగా మారిపోనున్న మూడు రాశులు 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook