Mangal Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. కుజుడిని అగ్ని మూలకం ఉన్న గ్రహంగా భావిస్తారు. మేషం మరియు వృశ్చికరాశికి అధిపతిగా మార్స్ ను భావిస్తారు. ఇటీవల కుజుడు మిథునరాశిలో సంచరించాడు. అతడు మే 10 వరకు అదే రాశిలో ఉంటాడు. అనంతరం కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఈ అంగారకుడి సంచారం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారకుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
సింహరాశి: మిథునరాశిలో కుజుడు సంచరించడం సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కుజుడు ఈ రాశిలోని పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు లాటరీ, బెట్టింగ్ లేదా మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభపడతారు. 
తుల: తులారాశి యెుక్క 9వ ఇంట్లోకి కుజుడు ప్రవేశించాడు. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది.  చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. 
కన్య: మార్స్ సంచారం వృత్తి మరియు వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుంది. మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు.  మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులకు భారీగా లాభం చేకూరుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. విద్య, మీడియా మరియు బ్యాంకింగ్‌కు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. 


Also Read: Lakshmi Narayan Yog: మేష రాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు తిరుగులేనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి