Mangal Gochar 2022: ఈనెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు ఉన్నాయి. అక్టోబరులో ప్రధానంగా 5 గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. దీని ప్రభావం మెుత్తం అన్ని రాశులవారిపై ఉంటుంది. ఇప్పటికే బుధుడు తిరోగమనం నుండి మార్గంలోకి వచ్చాడు. మరికొన్ని రోజుల్లో కుజుడు తన రాశిని మార్చనున్నాడు. పంచాంగం ప్రకారం, అక్టోబరు 16, ఆదివారం నాడు అంగారకుడు వృషభరాశి నుండి మిథునరాశిలోకి (Mars Transit in Gemini 2022) ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు పడనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో  తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): అంగారక సంచారం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఖర్చులు పెరుగుతాయి, దీంతో మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఆఫీసులో మీ బాస్ తో వివాదాలు రావచ్చు. కాబట్టి సంయమనంతో వ్యవహారించండి. మీ మాట తీరు వల్ల మీకు సమస్యలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.


మిథునం (Gemini) : ఈ రాశి యెుక్క లగ్నస్థ గృహంలో కుజుడు సంచరించడం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, లేకుంటే నష్టం జరగవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు. ఈ టైం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఓపికతో ఉండండి. 


మేషం (Aries): కుజుడు మేష రాశికి అధిపతిగా భావిస్తారు. అంగారక సంచారం వల్ల మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈసమయంలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీ శత్రువులతో అప్రమత్తంగా ఉండండి. 


కన్య (Virgo): కుజుడు సంచారంతో మీ కెరీర్‌కు సంబంధించిన అనేక చింతలు తొలగిపోతాయి. నిరుద్యోగులు కష్టపడి పనిచేస్తే ఉపాధి లభిస్తుంది. అయితే పార్టనర్ షిప్ తో వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఖచ్చితంగా అనుభవజ్ఞుల  సలహా తీసుకోండి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి, లేకుంటే ఇబ్బందులు తప్పవు.  కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మానుకోండి లేకపోతే హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది. 


Also Read: Shani Margi 2022: ప్రత్యక్ష సంచారంలోకి శనిదేవుడు...ధంతేరాస్ నుండి ఈ రాశులకు లక్కే లక్కు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి