Mars Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతిగా అభివర్ణిస్తారు. మంగళ గ్రహం అక్టోబర్ 3న తులా రాశిలో ప్రవేశించనుండటంతో వివిధ రాశులకు ఊహించని ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమత విశ్వాసాల ప్రకారం అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు మంగళ గ్రహం తులా రాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశుల జాతకాలపై పడనుంది. ముఖ్యంగా మూడు రాశులకు అమితమైన లాభాలు కల్గించనుంది. దీపావళి వరకూ ఈ మూడు రాశుల ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముండటం వల్ల భారీగా ధనలాభం కలగనుంది. మంగళ గ్రహాన్ని ఉగ్రం, పురుష ప్రధాన గ్రహంగా భావిస్తారు. తులా రాశికి శుక్ర గ్రహం అధిపతి.  మంగళ గ్రహం తులా రాశిలో ప్రవేశించడం వల్ల చాలామంది అదృష్టం మెరిసిపోనుంది. 


సింహ రాశి


మంగళ గ్రహం తులా రాశిలో ప్రవేశించడం వల్ల సింహ రాశి జాతకులకు అత్యంత ప్రయోజనం కలగనుంది. ఈ రాశివారికి అన్ని రకాల లాభాలుంటాయి. సింహ రాశి జాతకుల్లో సోదర సోదరీమణుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. మంచి జీతం లభిస్తుంది. ఇక వ్యాపారులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.


తుల రాశి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం తులా రాశిలో ప్రవేశించడంతో అమితమైన ప్రయోజనం ఈ రాశివారికే ఉంటుంది. పెళ్లైనవారి జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తారం చేసుకునే అవకాశముంటుంది.


వృషభ రాశి


వృషభ రాశి జాతకులకు మంగళ గ్రహం 6వ పాదంలో ఉండటంతో అమితమైన ప్రయోజనాలు కలగనున్నాయి. చదువుకునేవారికి మంచి అవకాశాలుంటాయి. సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం వల్ల అటు హోదా ఇటు జీతం రెండూ పెరుగుతాయి. వ్యాపారంలో అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది.


Also read: Surya Budh Gochar 2023: తులరాశిలో కలవనున్న రాజు-యువరాజు.. ఈ 3 రాశులకు పట్టనున్న అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook