Mars Transit In Pisces 2024 In Telugu:జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహాన్ని ధైర్యం శక్తికి కారకంగా భావిస్తారు. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ అంగారక గ్రహం ఈరోజు ఉదయం 8 గంటలకు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేసింది. ఈ సంచారదశ జూన్ 1 వరకు కొనసాగబోతోంది. అలాగే ఇప్పటికే మీనరాశిలో రాహువు శుక్ర గ్రహాలు సంచార దశలో ఉన్నాయి. అయితే మీన రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక జరగబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని అలాగే జీవితంలో ఒడిదుడుకులు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఏ రాశుల వారిపై కుజుడి చెడు ప్రభావం పడబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశి వారికి ఈ అంగారక గ్రహం సంచారం కారణ ంగా అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి దీంతో పాటు వీరికి ఆదాయం తగ్గి ఖర్చులు కూడా పెరుగుతాయి. అంతే కాకుండా భాగోద్వేగాల్లో మార్కులు కూడా వస్తాయి. దీంతోపాటు వీరు ఎలాంటి పనులు చేసిన అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శుభకార్యాలు ఆలస్యంగా జరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఓపికతో ఉండడం చాలా మంచిది ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా వివాదాలు పెరుగుతాయి. దీంతో పాటు ఆశించిన ఫలితాలు కూడా రాకపోవచ్చు కాబట్టి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. ఇవే కాకుండా మరిన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.


కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా ఈ అంగారక గ్రహ సంచారం కారణంగా అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బంధుత్వాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడును పెట్టడం వల్ల తీవ్ర నష్టాలు కూడా రావచ్చు. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన తీవ్రంగా నష్టపోతారు. దీంతో పాటు ఈ సమయంలో వీరు ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బైక్ లేదా కారు నడిపే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ధనస్సు రాశి:
ఈ సంచారం కారణంగా ధనస్సు రాశి వారు కూడా ప్రభావితం అవుతారు. ముఖ్యంగా వీరికి మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఆనందంగా ఒత్తిడి కూడా తీవ్రంగా పెరగవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. దీని కారణంగా జీవితం చిన్న భిన్నం అవ్వచ్చు. అలాగే వృత్తి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక మహిళలకు అయితే ఈ సమయంలో అత్తమామల నుంచి అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పది సార్లు ఆలోచించడం ఎంతో మంచిది. గత సంబంధాలలో కూడా అనేక మార్పులు వస్తాయి. దీంతో పాటు వీరు కోపానికి దూరంగా ఉండటం చాలా మంచిది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి