Mars Transit 2023: ప్రస్తుతం ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 27వ తేదీన మంగళ గ్రహం గోచారం ఉంటుంది. ఫలితంగా త్రిగ్రహ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఊహించని ధనలాభం కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళ గ్రహం ధనస్సు రాశిలో ప్రవేశించేసరికి ఆ రాశిలో అప్పటికే సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల మూడు గ్రహాలతో కలిపి త్రిగ్రహ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం ప్రభావం మొత్తం 12 రాశులపై స్పష్టంగా కన్పిస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారికి ఊహించని ధనలాభం కలగనుంది. 2024 కొత్త ఏడాది ప్రారంభమవుతూనే అంతులేని ధన సంపదలు వచ్చిపడతాయి. కెరీర్ విషయంలో చాలా లాభదాయకంగా ఉంటుంది. త్రిగ్రహ రాజయోగం ప్రభావం ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


మీన రాశి జాతకులకు త్రిగ్రహం రాజయోగం ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే కెరీర్ అత్యద్భుతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. మంచి లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 


మేష రాశి జాతకులకు త్రి గ్రహం రాజయోగం కారణంగా ఊహించని లాభాలు కలగనున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి, కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపార సంబంధం విషయాల్లో లాభాలు ఆర్జించవచ్చు. వ్యాపారం విస్తృతమయ్యే అవకాశముంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఊహించని ధనలాభంతో ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. 


వృశ్చిక రాశి జాతకులకు త్రిగ్రహ రాజయోగం లాభాలు కల్గించనుంది. గతంలో ఎక్కడైనా నిలిచిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి.


తులా రాశి జాతకులకు సూర్య, బుధ, మంగళ  గ్రహాల కలయికతో ఏర్పడే త్రిగ్రహ రాజయోగం కారణంగా విజయం సిద్ధిస్తుంది. కొత్త బాధ్యతలు కలిసొస్తాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి అద్భుతమైన అవకాశం.


ధనస్సు రాశి జాతకులు త్రి గ్రహ రాజయోగం ప్రభావంతో అంతా అనుకూలిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. వృత్తిపరమైన జీవితంలో ఉండేవారికి చాలా లాభం చేకూరుతుంది. 


Also read: Hatred Comments: అమెరికా హిందూ ఆలయం గోడలపై విద్వేష రాతలు, ఖండించిన ఇండియన్ ఎంబసీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook