Mangla Gochar Effect 2022: ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. కుజుడుని గ్రహాల కమాండర్ గా ఆస్ట్రాలజీలో భావిస్తారు. అంగారకుడు కొద్ది రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మేషరాశిలో ఉన్న కుజుడు..ఆగస్టు 10వ తేదీ రాత్రి 9:32 గంటలకు మేషరాశిని వదలి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎవరి జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉంటాడో వారు చాలా ధైర్యవంతులు. వీరు అంగారుకుడి అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ అంగారక సంచారం వల్ల కొన్ని రాశులవారు లాభ పడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- ఆగష్టు 10 న అంగారక గ్రహం ఈ రాశిలో సంచరించబోతోంది. ఈ సంచారం వల్ల ఈ రాశివారు చాలా లాభ పడనున్నారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలు అందుకుంటారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల నుండి బయటపడతారు.  


కర్కాటకం (Cancer)-కుజ సంచారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. మీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది.  ఈ సమయంలో అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు.


సింహం (Leo)- ఈ రాశుల వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. వీరు ఆర్థికంగా మెరుగుపడతారు. వ్యాపారంలో  లాభాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. 


ధనుస్సు (Sagittarius)- అంగారక సంచారం వల్ల మీ లైఫ్ సూపర్ గా ఉండనుంది. మీరు అనుకున్న దానిని కష్టపడి సాధిస్తారు. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. 


Also Read: Deepawali 2022: ఈ సంవత్సరం దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook