Mars Transit 2022: వృషభ రాశిలో కుజ సంచారం... ఈ 4 రాశులవారికి కష్టకాలం!
Mars Transit 2022: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. వృషభ రాశిలో కుజుడు సంచారం వల్ల కొంత మంది జీవితం ఒడిదుడుకుల లోనవ్వనుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
Mars Transit 2022 Effect: ఇవాళ అంటే బుధవారం, ఆగష్టు 10, 2022 నాడు కుజుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడే అక్టోబర్ 16 వరకు ఉంటాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, అంగారకుడిని గ్రహాల అధిపతిగా భావిస్తారు. మేషం మురియు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. నేటి రాత్రి 9:10 గంటలకు కుజుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి (Mars Transit in Taurus 2022) ప్రవేశిస్తాడు. దీని వల్ల నాలుగు రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి (Aries): వృషభరాశిలో అంగారకుడి సంచారం మీకు ఆశించిన ఫలితాలను ఇవ్వదు. ఈ సమయంలో మీరు గొడవలు పడే అవకాశం ఉంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ భార్యతో మీకు విభేదాలు రావచ్చు.
మిథునం (Gemini): కుజ సంచారం వల్ల ఈ రాశివారు డబ్బును బాగా దుబారా చేస్తారు. ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఉంది.
తుల రాశి (Libra): తుల రాశి వారికి అంగారక సంచారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీకు ఏదైనా జరగవచ్చు, దానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు పరుష పదజాలం ఉపయోగించకూడదు. దీని వల్ల మీ ఇంటి సభ్యులకు హాని జరగవచ్చు.
మీన రాశి (Pisces): మీన రాశి వారు అంగారక సంచార సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. మీ సోదరుడితో విభేదాలు రావచ్చు. కాబట్టి సంయమనంతో వ్యవహారించండి. ఉద్యోగంలో మీకు మీ సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభించదు.
Also Read: Venus Transit August Effect: కర్కాటకంలో శుక్ర సంచారం... ఈ 3 రాశులవారికి జాక్ పాట్ ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook