Mars Transits 2024: రోహిణి నక్షత్రంలో కుజుడు.. జాక్ పాట్ కొట్టబోతున్న 3 రాశులు!
Mars Transits Into Rohini Nakshatra: త్వరలోనే కుజ గ్రహం నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులన్నీ కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు.
Mars Transits Into Rohini Nakshatra Effect: ఒక రాశి నుంచి మరో రాశికి గ్రహ సంచారం జరగడం కారణంగా అన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు సంచారం చేయడం వల్ల కూడా ఇదే జరుగుతుంది. కానీ కుజ గ్రహం లాంటి కొన్ని శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల ప్రత్యేక ప్రభావం ఏర్పడుతూ ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండే ఈ గ్రహం, ఆగస్టు 15న రోహిణి నక్షత్రంలో ప్రవేశించి ఆ తర్వాతి రోజు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి ఉంటుందో తెలుసుకోండి.
మేషరాశి:
మేష రాశి పాలించే కుజ గ్రహం నక్షత్ర సంచారం చేయడం వల్ల వీరికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు అదృష్టం కూడా సహకరించి అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగతారు. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. అలాగే వీరికి శౌర్యం, ధైర్యం విపరీతంగా పెరిగి కష్టమనుకున్న పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది.
వృషభ రాశి:
కుజుడి సంచారం కారణంగా వృషభ రాశివారికి ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. వీరికి ఊహించని ధన లాభాలతో పాటు వ్యాపారాల్లో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో విదేశీ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు ప్రతి పనిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. అలాగే కెరీర్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మకర రాశి:
రోహిణి నక్షత్రంలో కుజుడు ప్రవేశించడం వల్ల ఆగస్టు నెలలో వీరికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి కుజుడి అనుగ్రహం లభించి అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. వ్యాపారాలు చేసేవారికి భారీ మొత్తంలో ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు విపరీతంగా ఆదాయ వనరులు కూడా పుట్టుకు వస్తాయి. మనస్సు కూడా ఎంతో సంతోషంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే భవిష్యత్‌కి సంబంధించిన ప్రయోజనాలు కూడా పొందుతారు. అంతేకాకుండా విదేశి పర్యటనలు కూడా చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి