Mars Transit 2023: వచ్చే 82 రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీది ఉందా?
Mars Transit 2023: వచ్చే నెల 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో కుజుడిని ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. మీ జాతకంలో అంగారకుడి మంచి స్థానంలో ఉంటే మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అదే అశుభ స్థానంలో ఉంటే మిమ్మల్ని అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఈ నెల 10న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అతడు జూలై 01 వరకు అక్కడే ఉండనున్నాడు. ఆ తర్వాత సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. రాబోయే 82 రోజులపాటు నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం
వృషభ రాశి వారికి అంగారక సంచారం అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ కోరికల్నీ నెరవేరుతాయి.
కన్య రాశి
కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం కన్యా రాశి వారిని ఆర్థికంగా బలపడేలా చేస్తుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. మీ ఖర్చులు తగ్గుతాయి. మీ మిత్రులతో సరదాగా గడిపే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
మే 10న జరగనున్న అంగారక సంచారం ధనుస్సు రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందనున్నారు. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి.
మీనరాశి
కర్కాటక రాశిలో కుజుడు సంచరించడం వల్ల మీన రాశి వారు ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరిగే అవకాశం ఉంది.
Also Read: Chandra Grahan 2023: మరో 3 రోజుల్లో ఈ రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook