Mars Transit 2023: గ్రహాల కమాండరైన అంగారకుడు రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. కుజుడు మార్చి 13న వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ధైర్యం మరియు శక్తికి కారకుడిగా మార్స్ ను భావిస్తారు. పైగా మేషం మరియు వృశ్చికరాశికి అధిపతి. కుజుడు మకరరాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటే, కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉంటాడు. మిథున రాశిలో అంగారకుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలగునున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుజుడు సంచారం ఈరాశులకు వరం
మేషరాశి
అంగారకుడి సంచారం మేషరాశి యెుక్క మూడవ ఇంట్లో జరగబోతుంది. ఈరాశికి అధిపతి కూడా కుజుడే. దీని కారణంగా మీరు వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయలక్ష్మీ మిమ్మల్ని వరిస్తుంది. సోదరుల సహకారం లభిస్తుంది. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 
మిధునరాశి
ఈ రాశిలో కుజుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 
ధనుస్సు రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు మీ ఆరవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Also Read: Trigrahi Yog 2023: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. ఈరాశులవారు కోటీశ్వరులవ్వడం పక్కా.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook