Mangal Gochar 2024 effect: గ్రహాల గమనం మనిషి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల కమాండర్ గా పిలువబడే అంగారక గ్రహం ఫిబ్రవరి 06న ధనస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి 15 వరకు అదే రాశిలో ఉండబోతున్నాడు. సృజనాత్మక గ్రహమైన కుజుడు సంచారం ఏ రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులకు లాభం
మేషం
అంగారకుడి రాశి మార్పు మేషరాశి వారిపై శుభప్రభావాన్ని చూపుతుంది. ఈరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఉద్యోగం సాధించే వారి కోరిక నెరవేరుతోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏ కార్యం చేపట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. మీరు డైట్ పాటించడం చాలా మంచిది. 
తులారాశి
మార్స్ సంచారం వల్ల మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు పురోగతి సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతోంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: February Horoscope Prediction 2024: ఫిబ్రవరి నెల మొత్తం ఈ రాశులవారికి లాభాలే..ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి!


ఈ రాశులకు నష్టం
మిథునం
కుజుడు కదలిక వల్ల మిథునరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఒత్తిడికి గురవుతారు. మీపై తోబట్టువుల కోపం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు కష్టాలు పెరుగుతాయి. 
మకరం
ఈ సమయంలో మకర రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. హైబీపీ ఉన్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి పుడ్ డైట్ పాటించండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. 


Also Read: Sun Transit: కుంభరాశిలోకి సూర్యుడి ప్రవేశం..ఈ 3 రాశుల వారి కోరికలు త్వరలోనే నెరవేరబోతున్నాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter