Mangal Margi In 2023: వేద జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. కుజుడి రాశిలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై ఉంటుంది. జనవరి 13న అంగారక గ్రహం ప్రత్యక్ష సంచారంలోకి రానుంది. కుజుడు కదలికలో మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఈ మార్పు వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): అంగారకుడి మార్గం కర్కాటక రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారంలో మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు భవిష్యత్తులో ప్రయోజనాలు పొందుతారు. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


కన్య రాశిచక్రం (Virgo): మార్స్ మార్గి కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మంగళదేవుడు మీ జాతకంలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. మానసిక ఒత్తడి దూరమవుతుంద. వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి. మీ ప్రేమ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. 


కుంభం (Aquarius): మంగళదేవుడి సంచారం వల్ల మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే కుజుడు మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. అందుకే ఈ సమయంలో మీ సుఖాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్‌ను పొందే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపార సంబంధాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి.


Also Read: Surya Sankranti 2023: సూర్య సంక్రాంతి ఈ 4 రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U   


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.