Mangal Margi 2023 effect on zodiac signs: ధైర్యం, శౌర్యం, శక్తి, భూమి, ఆస్తికి కారకుడిగా కుజుడిని భావిస్తారు. అంగారకుడిని రెడ్ ఫ్లానెట్, గ్రహాల కమాండర్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవాళ అంటే జనవరి 13, శుక్రవారం నుండి కుజుడు వృషభరాశిలో నేరుగా కదలడం (Mangal Margi 2023) ప్రారంభిస్తాడు. అంగారకుడి ప్రత్యక్ష సంచారం 5 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుజుడి సంచారం ఈ రాశులకు లాభదాయకం
వృషభం (Taurus): అంగారకుడి సంచారం కెరీర్ పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. పెళ్లికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. లవ్ సక్సెస్ అవుతుంది. ఉద్యోగ, వ్యాపారులు లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 
మిథునరాశి (Gemini): కుజుడు ప్రత్యక్ష సంచారం మిథున రాశి వారికి కెరీర్‌లో విజయాన్ని అందిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి.  
సింహ రాశి (Leo): సింహ రాశి వారికి మార్గి కుజుడు కారణంగా ఆస్తి కలిసి వస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  


వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారికి కుజుడు చాలా ప్రయోజనాలను ఇస్తాడు. ఉద్యోగంలో మార్పు రావచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విహారయాత్రకు వెళ్లవచ్చు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
ధనుస్సు (Sagittarius): కుజుడు ప్రత్యక్ష సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. కెరీర్ లో అపారమైన పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  


Also Read: Trikon Rajyoga: అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్న బుధుడు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి