Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ఫ్లానెట్ గా భావిస్తారు. కుజుడిని ధైర్యం, వివాహం, భూమి మరియు సోదరుడిగా భావిస్తారు. ప్రస్తుతం కుజుడు వృషభరాశిలో సంచరించస్తుంది. అతడు మార్చి 13న మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్స్ యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నవపంచం యోగం ఏర్పడుతుంది. ఇది 5 రాశులవారికి పురోభివృద్ధితోపాటు సంపదను కూడా ఇస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుజ సంచారం ఈ రాశులకు వరం
మేషం (Aries): మేష రాశి వారికి అంగారక సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీలో శక్తి మరియు సానుకూలత పెరుగుతుంది. పరీక్ష లేదా పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. 
మిథునం (Gemini): కుజుడు రాశిని మార్చి మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో వీరు శుభఫలితాలను పొందుతారు.  మీరు ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ దాంపత్య జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీరు వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 
సింహం (Leo):  సింహ రాశి వారికి అంగారకుడి సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. పాత పెట్టుబడి లాభిస్తుంది. కొత్త పెట్టుబడులకు కూడా ఇదే మంచి సమయం. మీరు ఖర్చులను అదుపులో పెట్టుకుంటే మీకే మంచిది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. 


కన్యా రాశి (Virgo): కుజుడి రాశి మార్పు కన్యారాశి వారి కెరీర్ లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. వ్యాపారులు కొత్త ఆర్డర్స్ లేదా డీల్స్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
మకర రాశి (Capricorn): కుజుడు రాశి మార్పు మకర రాశి వారికి గొప్ప విజయాన్ని ఇస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.  మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Sheetala Ashtami 2023: శీతల అష్టమి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook