COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Masik Shivratri 2023 Date And Time: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..మాస శివరాత్రిని ప్రతి నెల కృష్ణ పక్షంలోని చతుర్దశి రోజున జరుపుకుంటారు. పూర్వీకులు ఈ రోజును శివుడికి అంకితం చేశారు. ఈ రోజు శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారని భక్తల నమ్మకం. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నెలలో మాస శివరాత్రి సెప్టెంబర్‌ 13న రాబోతోంది. ఈ బుధవారం రోజు స్వామివారికి పూజలు చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన ఈ కింది పూజా పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. 


భాద్రపద మాస శివరాత్రి ఎప్పుడు? 
భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి సెప్టెంబర్ 13వ తేదీ తెల్లవారుజామున 2:21 గంటలకు మాస శివరాత్రి ప్రత్యేక సమయం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 4:48 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. భాద్రపద మాసంలో రాత్రిపూట శివుడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. 


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!


పూజా విధానం:


మాస శివరాత్రి రోజున శివపార్వతులను కొలిచేవారు తప్పకుండా పూజా పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.
పూజను ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. 
ఇంటిని గంగాజలంతో శుభ్రం చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీరు కూడా గంగాజలంతో తల స్నానం చేయాలి. 
ఇలా స్నానం చేసిన తర్వాతే పూజా గదిలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది.
మీ ఇంటి గుడిలో ఉన్న శివలింగాన్ని గంగాజలంతో అభిషేకం చేయాలి. 
ఇలా చేసిన తర్వాత ఆవు పాలతో శుభ్రం చేయాలి.
శివ మంత్రాలను పఠించి..శివుడికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్వామివారికి పండ్లతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 


పరిహారాలు:
రాహు దోషం నుంచి విముక్తి:

మాస శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్ని తొలిగిపోతాయి. అంతేకాకుండా రాహు దోషం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి ఉపవాసాలను పాటించి రాత్రి పూట దాకా ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రాహు దోషం నుంచి సులభంగా ఉపశమనం లభించి ఊహించని లాభాలు కలుగుతాయి. 


శనిగ్రహం అశుభ ప్రభావాలు:
శని దోషం కారణంగా తీవ్ర దుష్ప్రభావాలకు గురయ్యేవారు తప్పకుండా మాస శివరాత్రి రోజున ఉపవాసాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శివలింగానికి చెరకు రసంతో అభిషేం చేసి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శని చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.