Mauni amavsya 2023 Significance: మాఘమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు.  దీనినే మాఘ అమావాస్య (Mauni amavsya 2023) అని కూడా అంటారు. ఈరోజున పవిత్ర నదిలో స్నానం చేసి మీ పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి మౌని అమావాస్య తేదీ, శుభ సమయం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మౌని అమావాస్య ఎప్పుడు?
మౌని అమావాస్య తేదీ జనవరి 21వ తేదీ శనివారం ఉదయం 06.17 గంటలకు ప్రారంభమై.. జనవరి 22 ఆదివారం తెల్లవారుజామున 2.22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆధారంగా  మౌని అమావాస్యను జనవరి 21న పాటించనున్నారు. అదే రోజు ఉదయం 6:30 నుండి ఉదయం 07:14 వరకు శుభ యోగం ఏర్పడుతుంది. 


మాఘ అమావాస్య ప్రాముఖ్యత
మౌని అమావాస్య రోజున స్నానం మరియు దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సూర్యోదయానికి ముందు గంగానదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. పంచాంగం ప్రకారం, మౌని అమావాస్య రోజున ఉదయం 08.34 నుండి 09.53 మధ్య స్నానం చేయడం చాలా శ్రేయస్కరం.


Also Read: Venus Gochar 2023: కుంభరాశిలో శుక్ర గోచారం.. త్వరలో వీరికి గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.