Grah Gochar 2023: రేవతి నక్షత్రంలో కలుసుకున్న బుధుడు-బృహస్పతి.. ఈ 6 రాశుల ఇంటిపై నోట్ల వర్షం..
Grah Gochar 2023: రీసెంట్ గా రేవతి నక్షత్రంలో బుధుడు మరియు గురుడు కలయిక ఏర్పడింది. వీరిద్దరి మైత్రి ఆరు రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Budh yuti in Revati Nakshatra 2023: రేవతి నక్షత్రంలో బుధుడు మరియు బృహస్పతి యెుక్క అద్భుత కలయిక జరిగింది. ఈ రెండు గ్రహాలు కూడా ఈ నక్షత్రం యొక్క నాల్గవ దశను ప్రభావితం చేస్తాయి. బుధుడు తెలివితేటలు, స్పీచ్ మరియు కమ్యూనికేషన్ యెుక్క గ్రహం అయితే.. మరోవైపు బృహస్పతి జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. మీ జాతకంలో ఈ రెండు గ్రహాలు కలయిక ఏర్పడినట్లయితే మీరు అపారమైన జ్ఞానం పొందుతారు. అయితే, బుధుడు మరియు బృహస్పతి ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉన్నాయి. కానీ బుధుడు తన స్వంత నక్షత్రంలో ఉండటం వల్ల కొంత శక్తివంతంగా ఉంటుంది. వీరిద్దరి కూటమి రీసెంట్ గా మీనరాశిలో మార్చి 24వ తేదీ రాత్రి 07:19 గంటలకు జరిగింది. వీరి మైత్రి ఈ 6 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
వృషభం
బుధుడు మరియు బృహస్పతి కలయిక మీ11 వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు ఊహించని సంపదను పొందుతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
మిథునం
మిథునరాశి యెుక్క మొదటి, నాల్గవ గృహాలకు అధిపతి బుధుడు. సప్తమ, పదవ స్థానానికి బృహస్పతి అధిపతి. వీరిద్దరి కలయిక వల్ల మీరు కెరీర్ లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి యెుక్క బుధుడు 8వ మరియు 11వ గృహాలకు మరియు బృహస్పతి 2వ మరియు 5వ గృహాలకు అధిపతి. వీరిద్దరి కూటమి ఐదవ ఇంట్లో ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం మంచిది. వృశ్చిక రాశి వారి ఆదాయం పెరుగుతుంది. మీరు ఆర్థిక స్థిరత్వం పొందుతారు. మీ సహోద్యోగులు సపోర్టు లభిస్తుంది. మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి ఇదే మంచి సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి జాతకంలో బుధుడు సప్తమ, పదవ గృహాలకు అధిపతిగా, బృహస్పతి మొదటి, నాల్గవ గృహాలకు అధిపతి. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. ఆస్తి కొనుగోలు చేయడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఉద్యోగం మారడానికి ఇదే అనుకూల సమయం.
కుంభ రాశి
కుంభ రాశి యెుక్క 2వ మరియు 11వ ఇంటికి గురుడు అధిపతి. 5వ మరియు 8వ ఇంటికి బుధుడు అధిపతి. ఈ రెండు గ్రహాలు కుంభ రాశి యెుక్క రెండవ ఇంట్లో కలిసి ఉంటాయి. మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీ జ్ఞానం పెరుగుతుంది.
మీనరాశి
మీన రాశి వారికి మొదటి మరియు నాల్గవ గృహాలకు అధిపతి బృహస్పతి మరియు సప్తమ మరియు పదవ గృహాలకు బుధుడు అధిపతి. ఈ సమయంలో మీరు మీ కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. ఇది మీకు ఆకస్మిక ధన లాభాలను ఇస్తుంది.
Also Read: Mangal Gochar 2023: మిథునరాశిలో సంచరిస్తున్న కుజుడు.. ఈ 3 రాశులకు మే 10 వరకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి