Buddhaditya Yoga: ధనుస్సు రాశిలో బుధాదిత్య యోగం...ఈ 5 రాశుల వారిని వరించనున్న అదృష్టం..
Buddhaditya Yoga: ధనుస్సు రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల అనేక రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Buddhaditya Yoga in Sagittarius: డిసెంబరులో అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. అలాగే బుధుడు, సూర్యుడు కూడా తమ రాశులను మార్చి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాయి. ధనస్సు రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీనికి అనేక రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు డిసెంబరు 3న ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. తర్వాత డిసెంబరు 16న సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. ఈ రెండు గ్రహాలు ఒకేరాశిలో ప్రవేశించడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అనేక రాశుల ప్రజల అదృష్టాన్ని తెరవగలదు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి (Gemini): మిథున రాశి వారికి బుధ సంచారం మీకు మేలు జరుగుతుంది. దీంతో వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. పెళ్లికాని యువతీయువకులకు వివాహాలు కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి (Leo); ఈ రాశివారు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. ఉన్నత విద్యను పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, లాటరీల్లో పెట్టుబడి పెట్టేవారు లాభపడతారు. పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభాలను పొందుతారు.
కన్య (Virgo): ఈ రాశివారు మీరు అపారమైన ప్రయోజనాన్ని పొందుతారు. ఏదైనా ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు మంచి లాభాలను సాధిస్తారు. సూర్యుడు మరియు శుక్రుడు ఒకే రాశిలో సంచరించడం మీరు అనేక విధాలుగా లాభపతారు.
ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశిలోనే బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీంతో ఈ రాశివారు అపారమైన డబ్బును పొందనున్నారు. వ్యాపారం విస్తరిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మేషరాశి (Aries): ఈ రాశి వారికి బుధుడు మరియు సూర్య భగవానుడు ఒకే రాశిలో సంచరించడం వల్ల లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు శుభవార్తలను వింటారు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
Also Read: Raj Yoga: శుక్రుడి 'అష్టలక్ష్మి రాజయోగం'.. ఈ 3 రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి