Planet Transit 2024 effect: సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఈ రెండు గ్రహాల కదలికలో మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మార్చి 07న శుక్రుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. అదే రోజు బుధుడు మీనరాశిలోకి వెళ్లనున్నాడు. ఈ రెండు గ్రహాల సంచారం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధుడు మరియు శుక్రుడు సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. ఉన్నతాధికారుల నుంచి మీకు సపోర్టు లభిస్తుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ దారిద్ర్యమంతా తొలగిపోతుంది. 
మీన రాశి
గ్రహాల కదలిక కారణంగా మీనరాశి వారి మంచి ఫలితాలను పొందుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది, వీరికి శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.  
కర్కాటక రాశి
బుధుడు, శుక్ర గ్రహాల సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు వెనువెంటనే పూర్తవుతాయి. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీరు ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
సింహరాశి
జాబ్ కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతోంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది.  మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Venus Transit 2024: శివరాత్రికి ముందు రోజే శుక్రుడి సంచారం.. జ్యోతిష్యుల ప్రిడిక్షన్‌ ఇదే..


Also Read: Eclipse 2024: నెలవ్యవధిలోనే సూర్య-చంద్రగ్రహణాలు.. ఈ ఒక్క రాశికి మెగా బంపర్ ఆఫర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter