Mercury Combust 2023: బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. అటువంటి బుధ గ్రహం ఏప్రిల్ 23వ తేదీన అస్తమించనున్నాడు. బుధుడి అస్తమయం ప్రభావం 4 రాశులవారికి నెలరోజులపాటు జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదురుకానున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ జ్యోతిష్యం ప్రకారం బుధుడిని బుద్ధి, తర్కానికి ప్రతీకగా భావిస్తారు. బుధుడు మేషరాశి 6వ పాదానికి అధిపతి. బుధుడు ఏప్రిల్ 23వ తేదీన మేష రాశి మొదటి పాదంలో అస్తమించనున్నాడు. ఈ అస్తమయం కారణంగా కొన్ని రాశుల జీవితాలపై ప్రతికూలంగా, అనుకూలంగా రెంండిటినీ ఎదుర్కోవల్సివస్తుంది. ఈ సందర్భంగా అభివృద్ధి, ఆరోగ్య రంగాల్లో ప్రతికూల పరిణామాలుంటాయి. దాంతోపాటు ఆరోగ్య సంబంధిత సమస్యలైన నిద్రలేమి, ఆకలి లేకపోవడం, నిర్ణయం తీసుకునే సామర్ధ్యం లోపించడం వంటివి ఉంటాయి. బుధుడి అస్తమయం ప్రభావం 4 రాశులపై ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకుందాం..


బుధుడి మేషరాశి ఆస్తమయం ప్రభావం ఇలా


మేష రాశి


బుధుడి ఆస్తమించడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అధిక రక్తపోటు, తలనొప్పి వంటి  సమస్యలతో బాదపడాల్సిన పరిస్థితి ఉంటుంది. జీవనశైలిలో మార్పుండాలి. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సందర్భంగా ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. దాంతోపాటు మీకు సవాళ్లను ఎదుర్కొనే సామర్ధ్యం లభిస్తుంది.


కర్కాటక రాశి


ఈ రాశివారికి బుధుడి అస్తమించడం మంచి పరిణాం కానేకాదు. మంచి మంచి అవకాశాలు చేజారిపోతాయి. కొంతమందికైతే ఉద్యోగమే పోయే పరిస్థితి ఉంటుంది. మీరు మీ టార్గెట్ పూర్తి చేయకపోవడంతో మీ పై అధికారుల అసంతృప్తి వల్ల కెరీర్ నష్టపోతారు. అందుకే ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 


కన్యా రాశి


బుధుడి ఆస్తమించడం వల్ల పనిచేసేచోట మంచి పనితీరు కనబర్చలేరు. అదృష్టం తోడు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురౌతాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పనిచేసేచోట ఒత్తిడి అధికమౌతుంది. ఫలితంగా పనిపై దృష్టి సారించలేరు. వ్యాపారులకు సైతం నష్టాలు ఎదురౌతాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈసమయంలో సంపాదించిన డబ్బుల్ని పొదుపు చేయడం అసాధ్యం. 


ధనస్సు రాశి


బుధుడి అస్తమించడం వల్ల రానున్న సమయమంతా మీకు సవాళ్లే ఎదురౌతాయి. వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉంటుంది. వ్యాపార భాగస్వామి పూర్తిగా సహకరించకపోవడంతో నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు బాగా పెరిగిపోతాయి. వీటిని పూర్తి చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భవిష్యత్ ఆందోళనకరంగా ఉంటుంది.


Also read: Surya Gochar 2023: అధిక రాశిలో సూర్య సంచారం.. ఈ వ్యక్తులను వరించనున్న అదృష్టం! నోట్ల కట్టలతో ఆడుకుంటారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook