Mercury Combust In Taurus 2023: నవగ్రహాల్లో బుధుడు కూడా ఒకరు. ఇతడిని తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. కన్య మరియు మిథునరాశికి అధిపతిగా మెర్క్యూరీని పరిగణిస్తారు. గ్రహాల  రాకుమారుడైన బుధుడు ఈ నెల 19న వృషభరాశిలో అస్తమించనున్నాడు. జూలై 14 వరకు అదే స్థితిలో ఉంటాడు. దీని వల్ల 25 రోజుల పాటు 4 రాశుల జీవితాల్లో గందరగోళం నెలకొంటుంది. బుధుడి అశుభ ఫలితాలను నివారించడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మెర్క్యూరీ అస్తమయం వల్ల ప్రభావితమయ్యే రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
బుధ గ్రహం ఈ రాశిలోనే అస్తమించబోతోంది. దీంతో మీ కుటుంబంలో కలహాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేసినప్పటికి క్రెడిట్ మీకు దక్కదు. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. బుధుడి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ప్రతిరోజూ 11 సార్లు 'ఓం నమో నారాయణ' అని మంత్రాన్ని జపించండి.
కర్కాటకం
వృషభరాశిలో బుధుడు అస్తమయం వల్ల వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటారు. జాబ్ చేసేవారికి ఈసారి కూడా ప్రమోషన్ లభించకపోవచ్చు. దీని వల్ల వారు ఉద్యోగం మానేయవచ్చు లేదా వదిలేయవచ్చు. మీకు చర్మసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పరిహారం కోసం ప్రతిరోజూ 11 సార్లు 'ఓం సోమయ్ నమః' అని జపించడం మంచిది. 


Also Read: Benefits of Lakshmi Yoga: జులై 7 వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా?


సింహం
మెర్క్యురీ యొక్క సెట్టింగు మీకు అనేక సమస్యలను తెస్తోంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో అడ్డంకులను ఎదుర్కోంటారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలించవు. వ్యాపారులకు పెద్దగా లాభాలు ఉండవు. దాంపత్య జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 
కన్యా రాశి
బుధుడి అస్తమయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ ఆదాయం తగ్గుతుంది. మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. దీని ప్రతికూల ప్రభావాలను నివారించడానికి బుధ గ్రహానికి హవన-యాగం చేయండి.


Also Read: Astrology: సక్సెస్ ఎప్పుడూ ఈ రాశులవారి చుట్టే తిరుగుతూ ఉంటుంది.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook