Mercury Gochar 2023: ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా?
Mercury transit 2023: తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన బుధుడు గమనంలో రీసెంట్ గా పెను మార్పు వచ్చింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి నష్టాలను మిగులుస్తుంది.
Budh Gochar 2023: ఇటీవల బుధుడు మేషరాశిలోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం రాహువు కూడా ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జూన్ 7 వరకు అదే రాశిలో ఉంటాడు. అనంతరం మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో బుధుడి గోచారం వల్ల మూడు రాశులవారు తీవ్రమైన కష్టాలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
బుధ గోచారం ఈ రాశులకు నష్టదాయకం
వృషభం: మేషరాశిలో మెర్క్యురీ సంచారం మీ వృత్తిలో సమస్యలను సృష్టిస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అస్సలు కలిసి రాదు. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది. మీరు పనిలో సమస్యలను ఎదుర్కోంటారు. ఈ టైంలో వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య: బుధ సంచారం వల్ల కన్యారాశి వారు ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీకు పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీకు అనుకోని ఆపదలు వచ్చి పడతాయి. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీకు ఆఫీసులో సహచరుల మద్దతు లభించదు.
వృశ్చికం: బుధుడు రాశి మార్పు వృశ్చిక రాశి వారికి నష్టాలను కలిగిస్తుంది. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు రుణ విముక్తి పొందలేరు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. ఈ సమయంలో మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీకు మిత్రులు మరియు ఫ్యామిలీ సపోర్టు లభించదు.
Also Read: Navapanchama rajyog: 300 ఏళ్ల తర్వాత నవపంచం రాజయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook