Mercury Jupiter Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం గురుడిని జ్ఞానానికి, బుధుడిని తర్కం, గణితానికి కారకుడిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు రేవతీ నక్షత్రంలో యుతి ఏర్పర్చడంతో 5 రాశులకు దశ తిరగనుందని చెప్పవచ్చు. ఈ ఐదు రాశులపై నోటవర్షం కురుస్తుందట. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురు, బుధ గ్రహాలు రెండింటికీ విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రెండింటినీ శుభసూచకంగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల యుతి ఏర్పడనుంది. ఈ రెండూ రేవతి నక్షత్రంలో ప్రవేశించనున్నాయి. జ్యోతిష్యం ప్రకారం గురుడు జ్ఞానానికి బుధుడు తర్కం, గణితాన్ని కారకుడు. ఈ రెండూ రేవతి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల 5 రాశులకు దశ మారిపోనుంది. ఊహించని విధంగా నోట్ల వర్షం కురవనుంది.


మేషరాశి:


ఈ రెండు శుభ గ్రహాల కలయికతో మేషరాశి జాతకులకు దశ మారిపోనుంది. పూర్వీకుల సంపద లభిస్తుంది. మార్చ్ చివరి వారంలో సోదర సోదరీమణుల సహకారం, మద్దతు లభిస్తుంది. డబ్బులు సంపాదించేందుకు చాలా మార్గాలు కలుగుతాయి.


మిథున రాశి:


గురు, బుధ గ్రహాల యుతితో మిధున రాశి జాతకులకు చాలా లాభదాయకం. కెరీర్‌లో చాలా అవకాశాలు లభిస్తాయి. ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. వాహనం, భూమి, ఆస్థులు కొనుగోలు చేస్తారు. 


వృశ్చిక రాశి:


బుధ, గురు గ్రహాల యుతి కారణంగా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి అత్యంత శుభసూచకం. 


కుంభరాశి:


బుధ, గురు యుతి కారణంగా ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుంది. ఈ సమయం అత్యంత శుభసూచకంగా ఉంటుంది. వ్యాపారులకు అద్భుత లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. వెరసి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.


ధనస్సు రాశి:


ధనస్సు రాశి జాతకులకు ఈ యుతి అత్యంత లాభదాయకం. ఉద్యోగం మారే అవకాశం లభిస్తుంది. కెరీర్‌లో మంచి ఫలితాలు అందుతాయి. భూమి, ఆస్ధి కొనుగోలు చేయాలనుకుంటే ఇది అత్యంత శుభ సమయం.


Also Read: Rajyog 2023: సుమారు 20 ఏళ్ల తర్వాత 4 రాజయోగాలు.. ఈ రాశుల వారికి స్పెషల్ బెనిఫిట్స్..


Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook