Budh Margi january 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని శుభ గ్రహంగా భావిస్తారు. గ్రహాల యువరాజైన బుధుడు జనవరి 18, 2023 సాయంత్రం 6.18 గంటలకు ధనుస్సు రాశిలో మార్గంలోకి రానున్నాడు. బుధుడి యెుక్క ప్రత్యక్ష సంచారం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. మెర్క్యూరీ సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఏ రాశులకు శుభప్రదం
మిథునం (Gemini)
ఈ రాశి యెుక్క లగ్నానికి మరియు నాల్గవ ఇంటికి బుధుడు అధిపతి. వీరి జాతకంలో బుధుడు సప్తమంలో ఉంటాడు. బుధ దేవుడి మార్గం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ తీరుతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.


మకరం (Capricorn)
మకర రాశి యెుక్క ఆరవ మరియు తొమ్మిదవ ఇంటికి బుధుడు అధిపతి. వీరి జాతకంలోని పన్నెండవ ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి జీవితానికి సంబంధించిన సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 


కుంభం (Kumbh)
కుంభ రాశి  యెుక్క ఐదవ మరియు ఎనిమిదవ గృహాలకు బుధుడు అధిపతి. జాతకంలో బుధుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు. కుంభరాశివారు పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారుప్రేమికులకు కూడా సమయం ఈ అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also read: Shani Sadhesati 2023: రేపు ఈ రాశులకు శని పీడ నుండి విముక్తి.. ఇక వీరికి లక్కే లక్కు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook