Mercury Planet Transit 2023: వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అంటారు. తెలివితేటలు మరియు వ్యాపారానికి బుధుడు కారకుడు. ఆస్ట్రాలజీలో బుధ సంచారాన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇవాళ అంటే ఫిబ్రవరి 07న బుధుడు మకరరాశిలో సంచరించాడు. బుధ సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి
మెర్క్యురీ యొక్క రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో అదృష్ట స్థానంలో సంచరిస్తుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బును పెట్టేవారు లాభపడతారు. ఈరోజు నుంచి వీరు భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 
కన్య రాశిచక్రం
బుధ సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ జాతకంలోని ఐదవ ఇంట్లో సంచరిస్తుంది. అంతేకాకుండా మీ రాశికికి బుధుడు అధిపతి. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. 
తులా రాశిచక్రం
మెర్క్యురీ యొక్క రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో బుధుడు అదృష్టాధిపతిగా నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీరు ఈ సమయంలో ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు  చేసే అవకాశం ఉంది. మీ అదృష్టం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ సర్కిల్ పెరుగుతుంది. మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది. 


Also Read: Surya grahan 2023: ఏప్రిల్ లో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులకు కలిసి రానున్న కాలం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook