Mercury Planet will Retrograde in Mesham on 21st April 2023:  తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. మిథునం మరియు కన్యారాశికి అధిపతిగా మెర్క్యూరీని భావిస్తారు. బుధుడు మార్చి 31, 2023 మధ్యాహ్నం 02:44 గంటలకు మేషరాశిలో సంచరించాడు మరియు జూన్ 7 వరకు మేషరాశిలో ఉండి ఆ తర్వాత వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఏప్రిల్ 21 మధ్యాహ్నం 2.05 గంటలకు మరియు మళ్లీ మే 15 ఉదయం 8.45 గంటలకు తిరోగమనం చేస్తాడు. మేషరాశిలో బుధ వక్ర కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
మేషరాశి జాతకంలోని మూడవ మరియు ఆరవ ఇంటికి బుధుడు అధిపతి. ఈ రాశి యెుక్క మెుదటి ఇంట్లో తిరోగమనం చేయనున్నాడు. వృత్తి, వ్యాపారాల్లో మీరు భారీగా లాభపడతారు. మీకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. 


సింహరాశి 
సింహరాశి యెుక్క రెండవ మరియు పదకొండవ ఇంటికి బుధుడు అధిపతి. మీ తొమ్మిదవ ఇంట్లో మెర్క్యూరీ తిరోగమనం చేయనున్నాడు. ఈ సమయం మేషరాశి వారికి కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. 


Also Read: మేషరాశిలో సంచరించనున్న భానుడు.. రాబోయే 30 రోజులు వీరికి డబ్బే డబ్బు..


కుంభ రాశి
కుంభ రాశి యెుక్క ఐదవ మరియు ఎనిమిదవ గృహాలకు అధిపతి మెర్క్యూరీ. మీ రాశి యెుక్క మూడవ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. మీ కెరీర్ సూపర్ గా ఉంటుంది. ఉద్యోగులు పురోగతి సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. 


మీనరాశి
మీన రాశి యెుక్క  నాల్గవ మరియు ఏడవ ఇంటికి మెర్క్యూరీ అధిపతి. ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో బుధుడు తిరోగమనం చేయనున్నాడు. మీరు వృత్తిలో ప్రయోజనం పొందుతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. డబ్బును పొదుపు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.


Also Read: Surya Gochar 2023: మేషరాశి ప్రవేశం చేయనున్న సూర్యుడు.. ఏప్రిల్ 14 నుంచి ఈ 7 రాశులకు అన్నీ లాభాలే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook