Mercury transit 2023: త్వరలో వృషభరాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు కష్టాలు షురూ...
Budh Gochar 2023: గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చనున్నాడు. త్వరలో మెర్క్యూరీ వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. అయితే ఈ బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023 in taurus: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. జాతకంలో మెర్క్యూరీ శుభ స్థానంలో ఉంటే మీ తెలివితేటలు పెరగడంతోపాటు మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. రీసెంట్ గా బుధుడు ఉదయించాడు. త్వరలో మెర్క్యూరీ తన రాశిని మార్చబోతున్నాడు. జూన్ 7న బుధుడు వృషభ రాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. బుధుడి రాశి మార్పు కారణంగా 5 రాశులవారు అశుభ ఫలితాలను పొందనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి
మెర్క్యురీ ట్రాన్సిట్ సింహ రాశి వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు వృత్తి, ఉద్యోగ మరియు కెరీర్ లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. మీరు నిరంతర ఒత్తిడికి గురవుతుంది. ప్రతిరోజూ విష్ణు సహస్రనామం చదవడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
వృశ్చిక రాశి
మెర్క్యూరీ సంచారం వృశ్చిక రాశి వారికి చాలా కష్టాలను ఇస్తుంది. ఆఫీసులో సహచరులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు భారీగా నష్టాలను చవిచూస్తారు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. "ఓం భౌమాయ నమః" అనే మంత్రాన్ని 27 సార్లు జపించడం వల్ల మీరు లాభపడతారు.
మేష రాశి
బుధుడి సంచారం కారణంగా మేషరాశివారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీకు ప్రతి పనిలో అపజయమే కలుగుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో "ఓం నరసింహాయ నమః" అనే మంత్రాన్ని ప్రతిరోజూ 41 సార్లు పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
Also Read: Shani Jayanti 2023: శని జయంతి రోజే 3 యోగాలు ఏర్పడబోతున్నాయి! ఈ రాశులవారికి పండగే..
మిధునరాశి
బుధగ్రహ గోచారం వల్ల మిథునరాశి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. మీరు ఎంత కష్టపడు పనిచేసినప్పుటికీ మీరు విజయాన్ని సాధించలేరు. మీరు అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజూ 21 సార్లు "ఓం నమః శివాయ్" అనే మంత్రాన్ని జపించడం వల్ల మేలు జరుగుతుంది.
మీనరాశి
బుధుడి రాశి మార్పు వల్ల మీన రాశి వారికి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు స్కిన్ డిసిజీస్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. లవ్ లో సక్సెస్ కాలేరు. ప్రతి గురువారం పెద్దలకు దానం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది.
Also Read: May Rashi Parivartan 2023: రాబోయే 15 రోజుల్లో ఈ 4 రాశుల సుడి తిరగబోతుంది.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook