Budh Vakri Effect 2022: గత నెల 21న బుధగ్రహం కన్యారాశిలోకి ప్రవేశించింది. ఇవాళ అంటే సెప్టెంబరు 10న మెర్య్కూరీ గ్రహం అదే రాశిలో తిరోగమనం (Mercury Retrograde in Virgo 2022) చేయనుంది. అనంతరం అక్టోబరు 2న అది మార్గంలోకి వస్తుంది. ఆ తర్వాత అక్టోబరు 26న తులరాశిలోకి ప్రవేశిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం మారినప్పుడు లేదా తిరోగమనంలో ఉన్నప్పుడు, అది మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది.  కన్యారాశిలో బుధుడి తిరోగమనం కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. అయితే మెర్య్కూరీ తిరోగమనం వల్ల మెుత్తం 12 రాశులవారు ఎలాంటి బెనిఫిట్స్ పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries) - బుధుడి తిరోగమనం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. అయితే ఈ సమయంలో ఈ రాశివారు శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.
వృషభం (Taurus)- ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఈ సమయం బాగుంటుంది.
మిథునం (Gemini)- ఈ సమయం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సౌకర్యాలు మెరుగుపడతాయి. 
కర్కాటకం (Cancer)- ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.  కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ సమయంలో చర్చలకు దూరంగా ఉండటం మంచిది.  
సింహం (Leo) - ఉద్యోగ, వ్యాపారాలలో అఖండ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీరు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
కన్య (Virgo)- ఇదే రాశిలో మెర్క్యురీ తిరోగమనం చేయడంతో ఈ రాశివారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. 
తుల (Libra)- ఈ రాశి వారు ఈ సమయంలో తమ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కోర్టు పనిలో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది.


వృశ్చికం (Scorpio)- బుధుడు తిరోగమనం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వ్యాపారులకు భారీ ధనలాభం ఉంటుంది.  
ధనుస్సు (Sagittarius)-కెరీర్ లో పురోగతి సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.  
మకరం (Capricorn)- బుధుడు తిరోగమనం చేయడంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. లక్ తో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభం (Aquarius)- ఈ సమయం వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఈ కాలంలో ఏ వ్యక్తితోనూ డబ్బు లావాదేవీలు జరుపవద్దు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మీనం (Pisces)- భాగస్వామ్యంతో సంబంధం ఉన్న వ్యాపారులు ఈ కాలంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. సంతానం లేని దంపతులు పిల్లలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది.


Also Read: Horoscope Today September 10th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు ఏ పని చేట్టినా ప్రతికూలత ఎదురవుతుంది..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook