Mercury Retrograde 2023: బుధుడి తిరోగమనంతో ఆ 4 రాశులు తస్మాత్ జాగ్రత్త, ఆగస్టు 24 నుంచి వెంటాడనున్న కష్టాలు
Mercury Retrograde 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా భావిస్తారు. బుధుడి మార్గంలో ఏ మార్పు జరిగినా అది కాస్తా ఇతర రాశులపై పడుతుందంటారు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Mercury Retrograde 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా వక్రమార్గం అనేది అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ప్రస్తుతం గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడి వక్రమార్గం ప్రభావంతో ఆ 4 రాశులవారికి తీవ్రమైన కష్టాలు ఎదురుకానున్నాయి.
మొత్తం 9 గ్రహాల్లో బుధుడి పరిమాణం చాలా చిన్నది. అదే సమయంలో హిందూ విశ్వాసాల ప్రకారం రాజకుమారుడిగా పరిగణిస్తారు. అందుకే బుధుడి కదలికకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంటాయంటారు జ్యోతిష్య పండితులు. బుద గ్రహం ఆగస్టు 24 అంటే మరో రెండ్రోజుల్లో వక్రమార్గం పట్టనున్నాడు. దాంతో నాలుగు రాశులవారికి బ్యాడ్ డేస్ ప్రారంభమైనట్టే. ఎక్కడ అడుగెడితే అక్కడ నష్టం కలగనుంది. చంద్రుడి తరువాత అత్యంత వేగంగా కదిలే గ్రహం ఇది. మరోవైపు బుధుడిని బుద్ధి, సామర్ధ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఆగస్టు 24వ తేదీ రాత్రి 12 గంటల 52 నిమిషాలకు సింహరాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. అంటే తిరోగమనం వెనక్కి పరిభ్రమించడం జరుగుతుంది. హిందూమతం ప్రకారం బుధుడి తిరోగమనం కొందరి జీవితాల్లో అనేక కష్టనష్టాలకు కారణమౌతుంది.ముఖ్యంగా ఈ నాలుగు రాశులవారికి అన్నీ కష్టాలే ఎదురుకానున్నాయి. ఈ కష్టాల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని ఉపాయాలను కూడా జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
బుధుడి వక్రమార్గం కారణంగా వృశ్చిక రాశి జాతకుల ఇంట్లో వస్తువులు తరచూ పాడవుతూ సమస్యగా మారుతుంది. ఇంట్లో తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ అప్పుల భారం పెరిగిపోతుంటుంది. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగస్తులుకు కూడా కష్టకాలం ఉంటుంది. పనిచేసే చోట గుర్తింపు లోపిస్తుంది. ఉన్నతోద్యోగుల్నించి చీవాట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సంయమనం పాటిస్తే మంచిది. పనిచేసే చోట, ఇంట్లో బుధ యంత్రాన్ని స్థాపిస్తే ఉపశమనం పొందవచ్చు.
బుధుడి తిరోగమనం ప్రభావం మేష రాశి జాతకులపై తీవ్రంగా ఉండనుంది. ముక్యంగా ఈ రాశి వారి కుటుంబంలో ప్రేమ సంబంధ సమస్యలు ఉత్పన్నం కావచ్చు. పలు సవాళ్లు ఎదుర్కోవచ్చు. పిల్లల చదువులు ఆటంకం ఎదురౌతుంది. ఆర్ధికంగా సమస్యలు రావచ్చు. దీనికితోడు మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. రోజూ బుధగ్రహానికి చెందిన బీజా మంత్రం పఠించాలి
బుధ గ్రహం తిరోగమనం చెందడం వల్ల సింహ రాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత రోగాలు , జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం సమస్యగా మారుతుంది. ఇంట్లో పరిశుభ్రత ఉండేట్టు చూసుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఆర్ధిక సంబంధమైన ఘర్షణలు వస్తాయి. ఈ అన్ని సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు రోజూ తులసీ మొక్కలు నీరు అభిషేకం చేయాలంటారు.
బుధగ్రహం వక్రమార్గం ప్రభావం మిదున రాశి జాతకులపై ప్రతికూలంగా ఉండి వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా మీరు తరచూ వాడే ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌లో సమస్య రావచ్చు. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. ఎవరితోనూ దేనితోనూ వాదనకు ఘర్షణకు దిగవద్దు. కుటుంబసభ్యుల మధ్య విబేధాలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆర్ధికంగా కష్టాలు ఎదురౌతాయి. డబ్బులకు కష్టపడాల్సి వస్తుంది.
Also read: Nagula Chavithi In 2023: నాగుల పంచమి రోజున ఊహించని లాభాలు పొందబోయే రాశుల వారు వీరే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook