Budh Uday In Pisces 2023: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఇది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. గ్రహాల యువరాజు అయిన మెర్క్యూరీ తన మిత్రుడైన బృహస్పతి యెుక్క రాశి అయిన మీనంలో మార్చిలో ఉదయించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు పురోభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
కన్య రాశిచక్రం
బుధుడి యెుక్క ఉదయం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి సప్తమంలో ఉదయించబోతున్నాడు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 
వృశ్చిక రాశిచక్రం
మెర్క్యూరీ రైజింగ్ వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఉదయిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది.
ధనుస్సు రాశిచక్రం
మెర్క్యూరీ ఉదయం ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఉదయిస్తుంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈ సమయంలో ఏదైనా ఆస్తిని పొందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు లాభపడతారు. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు రావచ్చు. బిజినెస్ చేసేవారు మంచి లాభాలు పొందుతారు. 


Also Read: Sun Transit 2023: సూర్యభగవానుడి మీనరాశి ప్రవేశం... ఈరాశులకు మంచి రోజులు ప్రారంభం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.