Budh Asta 2023: ప్రతి గ్రహం ఒకానొక సమయంలో ఉదయించడం లేదా ఆస్తమించడం చేస్తాయి. అదే విధంగా జ్ఞానం మరియు వ్యాపారాన్ని ఇచ్చే బుధుడు ఈనెల 1వ తేదీన అస్తమించాడు. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. మెర్క్యూరీ అస్తమయ సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి అస్తమయం ఈ రాశులకు కష్టకాలం
కుంభ రాశి
బుధ గ్రహం యొక్క అస్తమయం కుంభ రాశి వారికి అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ సంచార జాతకంలో లగ్న గృహంలో అస్తమించబోతుంది. దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.  ఆఫీసులో అధికారులతో మీ సంబంధాలు క్షీణిస్తాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. ఈసమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా అధికమవుతాయి. 
మేష రాశి
మెర్క్యురీ అస్తమయం మీకు హానికరం. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి ఆదాయ గృహంలో సెట్ చేయబడుతుంది. దీని కారణంగా మీకు అనుకున్నంత ఆదాయం ఉండదు. ఈ సమయంలో కొత్త పనులు లేదా వ్యాపారం చేయడం మానుకోండి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. వ్యాపారంలో పెద్దగా లాభాలు ఉండవు. 
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మెర్క్యురీ గ్రహం యొక్క అస్తమయం అశుభం.  ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో సెట్ చేయబడింది. అందుకే ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో విభేదాలు తలెత్తవచ్చు. లక్ కలిసి రాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. 


Also read: Shani Uday 2023: కుంభంలో ఉదయించిన శని.. ఈ రాశులకు తిరుగులేని మనీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook