Budh Asta 2023: మరో మూడు రోజుల్లో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు ప్రతి పనిలో విజయం..
Budh Asta 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 23న మేషరాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
Mercury Set 2023: ప్రతి గ్రహం ఒక పర్టికలర్ టైం తర్వాత ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మేధస్సుకు కారకుడైన బుధుడు మీ జాతకంలో మంచి స్థానంలో ఉంటే మీకు తెలివితేటలకు కొదవ ఉండదు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మెర్క్యూరీ ఈ నెల 23, రాత్రి 11.58 గంటలకు మేషరాశిలో అస్తమించనున్నాడు. బుధుడి యెుక్క ఈ అస్తమయం కారణంగా మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశి యెుక్క తృతీయ, ఆరవ ఇంటికి బుధుడు అధిపతి. మెర్క్యురీ అస్తమయం కారణంగా మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మిధునరాశి
మీ జాతకంలోని పదకొండవ ఇంట్లో బుధుడు అస్తమిస్తాడు. మెర్క్యూరీ యెుక్క ఈ అస్తమయం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆఫీసులో మంచి బెనిఫిట్స్ పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. మీకు ప్రతి పనిలో గెలుపు దక్కుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది.
Also Read: Nakshatra Gochar 2023: అశ్వినీ నక్షత్రంలో గురు సంచారం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..
కన్య
కన్యా రాశి యెుక్క ఎనిమిదవ ఇంట్లో మెర్క్యూరీ అస్తమిస్తాడు. బుధుడి గోచారం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.
Also Read: Shani Vakri 2023: రివర్స్ లో ప్రయాణించబోతున్న శని గ్రహం.. వచ్చే 139 రోజులు ఈ రాశులకు బాధాకరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook