Mercury Transit 2022: గ్రహాలు సరైన దశలో ఉంటేనే జీవితంలో అనుకున్న పనులు జరుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర దుష్ర్పభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే గ్రహాల సంచారం వల్ల కూడా కొన్ని రాశు వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సంచార క్రమంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా డిసెంబర్‌ నెలలో అంగారక గ్రహం వృశ్చికరాశిలో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ ప్రభావం చాలా రకాల రాశులపై పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్నరాశు వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయోజనాలు పొందేది ఈ రాశువారేనా..?:
మేష రాశి:

ఈ రాశి వారు సంచారం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు డిసెంబర్‌, జనవరి నెలలో షాపింగ్స్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థిక పరమైన సమస్యలు కూడా దూరమవుతాయి.


కర్కాటక రాశి:
బుధుడు కర్కాటక రాశిలోనే తిరోగమన దశలో ఉండడం వల్ల జీవనోపాధి విషయంలో తెలివితేటలు పాటించి లాభాలు గడించే అవకాశాలున్నాయి. అయితే దీని ప్రభావం వల్ల ఈ రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరికి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రయణాలు చేసే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


కన్య:
బుధుడు తిరోగమనంలో ఉండడం వల్ల కన్య రాశి వారికి అనుకున్న పనులు జరగపోవచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలో చర్మ సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశి వారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కన్య రాశి వారు కష్టపడి పనులు చేయడం వల్ల యజమాని నుండి ప్రశంసలు పొందుతారు.


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మికత పట్ల మొగ్గు పెరుగుతుంది.  దీని కారణంగా పూజలు వంటి మంచి పనులలో మనస్సు నిమగ్నమై ఉంటుంది. కళకు సంబంధించిన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మునుపటి కంటే బలంగా ఉంటాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత ఈ రాశి వారు తోబుట్టువులతో విహార యాత్రలకు వెళ్తారు.


Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్


Also Read : Sai Dharam Tej Sweet Reply : ఎంతైనా మెగా హీరో కదా?.. ఒదిగి ఉండటం బ్లెడ్డులోనే ఉంటుందేమో.. నెటిజన్‌కు స్వీట్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి