గ్రహాల రాజకుమారుడైన బుధుడు ఫిబ్రవరి 7వ తేదీ ఇవాళ ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా మరి కాస్సేపట్లో ఈ రాశులవారికి మంచి రోజులు ప్రారంభమౌతాయి. ఏకంగా నెలరోజులు అదృష్టం తోడై..డబ్బుల్లో మునిగితేలనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల రాజకుమారుడు బుధుడు ఫిబ్రవరి 7న అంటే ఇవాళ ధనస్సు రాశి నుంచి బయలుదేరి మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఇవాళ ఉదయం 7 గంటల 11 నిమిషాలకు మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఇవాళ్టి నుంచి 5 రాశుల జాతకాలకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. బుధుడు కొన్ని రాశుల జాతకులకు విశేషమైన లాభం కలగనుంది. బుధ గోచారం ఏ రాశివారికి శుభ ప్రదం కానుందో తెలుసుకుందాం..


మేషరాశి


జ్యోతిష్యం ప్రకారం బుధగోచారం మేషరాశిపై శుభ సూచకం కానుంది. ఈ రాశ దశమపాదంలో గోచారం చేయనుండటంతో మీరు చేపట్టిన పనుల్లో లాభాముంటుంది. పనిచేసేచోట అధికారులు, తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలుంటాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా..ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది. అటు వ్యాపారులకు విశేషంగా లాభం కలగనుంది.


ఈ రాశి నవమ పాదంలో ఉండటం వల్ల ఆ వ్యక్తి నిలిచిపోయిన డబ్బులు తిరిగి అందుతాయి. పెట్టుబడులపై లాభాలుంటాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. అంతేకాకుండా..కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే...ఇప్పుడు సరైన సమయం. చదువుకునే విద్యార్ధులకు సైతం అనువైన సమయం.


కర్కాటక రాశి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి శుభ ఫలాలు కలుగుతాయి. ఈ గోచారం ఏడవ పాదంలో ఉంటుంది. వ్యాపార భాగస్వామితో పాటు మంచి సంబంధాలుంటాయి. వ్యాపార భాగస్వామితో ఏమైనా సమస్యలుంటే..ఆ సమస్య పరిష్కారమౌతుంది. ప్రతి పనిలో సాఫల్యత ఉంటుంది. దాంతోపాటు జీవిత భాగస్వామితో పాటు సంబంధాలు మెరుగుపడతాయి. జ్యోతిష్యం ప్రకారం ప్రేమ బంధాలకు మంచి సమయం.


కన్యారాశి


కన్యారాశి వారికి పంచమ పాదంలో గోచారం కారణంగా..అన్నీ శుభాలు జరగనున్నాయి. విద్యలో వృద్ధి ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. శుభవార్తలు వింటారు. చదువులో పిల్లలకు ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలం సమయం.


తులా రాశి


జ్యోతిష్యం ప్రకారం తులారాశి నాలుగవ పాదంలో గోచారం కారణంగా ఈ సమయం తులారాశి జాతకులకు అత్యంత శుభ సమయం. ఈ సందర్భంగా ఈ రాశి జాతకులు తమ కర్మ ఆధారంగా భవిష్యత్తును మెరుగుపర్చుకుంటారు. కుటుంబం, పని, వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తారు. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వాహనం, ఆస్థి కొనుగోలు చేస్తారు. 


Also read: Surya Shani yuti: సూర్య శని గ్రహాల యుతితో ఈ 6 రాశులకు రానున్న 30 రోజులు అంతా ఐశ్వర్యమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook