Mercury Transit 2023: బుధుడి ప్రభావంతో ఈ రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు..
Budh Vakri Mercury Transit: బుధుడి తిరోగమన ప్రభావం కొన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ర్పభావాలకు గురవుతారు.
Budh Vakri Mercury Transit: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి శుభాలు, కలిగితే మరికొన్ని రాశులవారి అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు బుధుడు తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అదృష్టం కూడా పెరుగుతుంది. ఈ తిరోగమనం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:
మేష రాశి వారు ఈ క్రమంలో కోపానికి లోనవుతారు. దీని కారణంగా తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపానికి దూరంగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఖర్చులు పెరగడం కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి:
బుధుడి తిరోగమనం కారణంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు కూడా జరుగుతాయి. భవనం నిర్వహణ అలంకరణపై ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న వస్తువులకు ఖర్చులు పెట్టే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మిథున రాశి:
మిథున రాశి ఈ తిరోగమనం కారణంగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మనస్సులో ప్రతికూల ఆలోచనలు చేయడం మానుకోవాల్సి ఉంటుంది. రచనలు చేసేవారికి ఈ సమయంలో ఒక్కసారిగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి:
బుధుడు తిరోగమనం చేయడం వల్ల ఈ రాశివారికి మాటలో మాధుర్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు బిజీ బిజీగా ఉంటారు. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అయితే ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
సింహ రాశి:
ఈ తిరోగమనం కారణంగా సింహ రాశి వారికి కూడా మనసులో ఒడిదుడుకులు మొదలవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా మనసులో ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది. కోపం కారణంగా వీరు తీవ్ర వివాదాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి