Budh Gochar Effect 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. గ్రహాల గమనంలో మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇవాళ అంటే జూన్ 07న బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ గమనంలో మార్పు కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇస్తే.. మరికొందరికి అశుభఫలితాలను ఇస్తుంది. బుధుడి సంచార సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
బుధ గ్రహ సంచారం మేషరాశి వారికి కలిసి రాకపోవచ్చు. మీరు కెరీర్ లో ఎదగాలంటే మరింత కృషి చేయాలి. ఈ సమయంలో ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం అస్సలు కలిసిరాదు. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. 
మిధునరాశి
వృషభరాశిలో బుధుడు సంచరించడం వల్ల మిధున రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా నష్టం రావచ్చు. మీకు పనిలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి.


Also Read: Shash Rajayogam 2023: జూన్ 17న శష్ రాజయోగం..ఈ 3 రాశులకు కలిసిరానున్న కాలం..


కర్కాటక రాశి
మీరు కెరీర్ లో ఎదగడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీరు భారీగా డబ్బు నష్టపోతారు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎటువంటి ప్రయాణాలు చేయవద్దు. మీ కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు.
సింహరాశి 
బుధుడి రాశి మార్పు వల్ల సింహరాశి వారికి ప్రతి పనిలో అపజయమే ఎదురవుతుంది. అయితే మీరు ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడికి ఇది సరైన సమయం కాదు. మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ కెరీర్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.


Also Read: Rahu Planet: రాహువు ఎప్పుడూ ఈ 2 రాశులవారిని ఇబ్బంది పెట్టడు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook