Budh Gochar 2023: నీచ రాజయోగాన్ని సృష్టించిన బుధుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..
Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా నీచభంగ్ రాజయోగాన్ని సృష్టించింది. ఈ రాజయోగం 3 రాశుల వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
Mercury Transit 2023 in Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో 9 గ్రహాలు మరియు 27 రాశుల స్థానం ఆధారంగా భవిష్యత్తును గణిస్తారు. ఈ గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు రీసెంట్ గా మీనరాశిలోకి ప్రవేశించాడు. సంపద, తెలివితేటలు, వ్యాపారానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. మెర్క్యూరీ బలహీన రాశిలో ప్రవేశించడం ద్వారా నీచభంగ్ రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందుతారు. మీనరాశిలో మెర్క్యురీ సంచారం ఏ రాశుల వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుందో తెలుసుకుందాం.
మెర్క్యురీ ట్రాన్సిట్ ఈ రాశులకు సూపర్
వృషభం: వృషభ రాశి వారికి బుధ సంచారం ద్వారా ఏర్పడిన నీచభంగ్ రాజయోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. అదృష్టం పెరుగుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభిస్తుంది.
మకరం: బుధుడు రాశి మారడం వల్ల ఏర్పడిన నీచభంగ్ రాజయోగం మకర రాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. లక్ కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. బిజినెస్ భారీ డీల్ కుదుర్చుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి.
కుంభం: బుధుడు రాశి మార్పు కుంభ రాశి వారికి వరప్రసాదం. ఈ రాశిలో శని సడే సతి కొనసాగుతున్నప్పటికీ బుధ సంచారం కొంత కాలం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఏదైనా పెద్ద కోరిక నెరవేరుతుంది. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది.
Also Read: Chaturgrahi Yog: గురు రాశిలో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రోజు నుంచి రాశులకు అన్నీ లాభాలే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook