Mercury Transit 2023 in Taurus: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న గ్రహాల్లో బుధ గ్రహం ఒకటి. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం ఈ బుధ గ్రహం నాలుగు నుంచి ఐదు సార్లు రాశి సంచారం చేస్తుంది. జూన్ నెలలో మొదటగా బుధ గ్రహం వృషభరాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం జూన్ 7వ తేదీన రాత్రి 7 గంటల 45 నిమిషాలకు జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచార కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

✵ బుధ గ్రహ సంచారం కారణంగా వృషభ రాశి వారిపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావం కారణంగా వృషభ రాశి వారు చాలా అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా వీరికి ఈ క్రమంలో కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం సరైనదిగా భావించవచ్చు. ఉద్యోగం చేసేవారు కష్టపడి పనిచేయడం వల్ల పదోన్నతులు పొందుతారు.


✵ బుధుడి సంచారం మకర రాశి వారికి ఐదవ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా వీరు ఎలాంటి పనులు చేసినా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. వీరికి అన్ని పనుల్లోనూ అదృష్టం సహకరిస్తుంది.


Also Read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది


✵ వృషభరాశిలో బుధుడు సంచారం చేయడం వల్ల సింహ రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి ఈ క్రమంలో అదృష్టం రెట్టింపవడమే కాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంచార క్రమంలో వీరు కష్టపడి పనిచేయడం వల్ల ఆశించిన విజయాన్ని పొందగలుగుతారు.


✵ ధనస్సు రాశి వారిపై కూడా బుధ గ్రహ సంచారం తీవ్రంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు తప్పకుండా పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం లాభదాయకమైనదిగా చెప్పవచ్చు.


✵ కన్యా రాశికి అధిపతిగా బుధ గ్రహం వ్యవహరిస్తోంది. కాబట్టి జూన్ నెలలో జరిగే బుధ గ్రహ సంచార ప్రభావం కన్య రాశి వారిపై కూడా పడుతుంది. ఈ క్రమంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.


Also Read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి