గ్రహాల రాజకుమారుడు బుధుడి గోచారానికి జ్యోతిష్యంలో విశేష మహత్యముంది. బుధ గోచారంతో అన్ని రాశుల జాతకుల ఆర్ధిక పరిస్థితి, వ్యాపారంపై పడనుంది. ఫలితంగా కొన్ని రాశులవాళ్లు..20 రోజుల వరకూ నిరాటంకంగా రెండు చేతులూ సంపాదిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 7వ తేదీన బుధ గ్రహం ధనస్సు రాశి నుంచి బయటికొచ్చి శనిగ్రహ రాశి మకరంలో ప్రవేశించనున్నాడు. హిందూ జ్యోతిష్యం ప్రకారం బుధ గోచారం ప్రభావం 5 రాశులపై విశేషంగా ఉండనుంది. ఆ రాశులేంటి, బుధ గోచారం ఎలాంటి ప్రభావం చూపించనుందనే వివరాలు తెలుసుకుందాం..ముఖ్యంగా ఈ ఐదు రాశుల జాతకులు ఫిబ్రవరి 7 నుంచి 20 రోజుల వరకూ రెండు చేతులతో అమితంగా సంపాదిస్తారంటున్నారు జ్యోతిష్య పండితులు. 


బుధుడి రాశి పరివర్తనంతో మారనున్న అదృష్టం


వృషభ రాశి


వృషభ రాశి జాతకులకు బుధుడి గోచారం అత్యంత శుభంగా ఉంటుంది. మీ జీవితంలో చాలా పాజిటివ్ పరిణామాలు సంభవిస్తాయి. కుటంబంలో సుఖ వాతావరణం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అదృష్టం మెరవనుంది.


మిథున రాశి


మిథున రాశి జాతకులకు బుధుడి రాశి పరివర్తనం ప్రభావంతో మీ జీవితంలో శుభ పరిణామాలు కలుగుతాయి. భాగస్వామితో మంచి సంబంధాలుంటాయి. మీతో సమయం బాగా గడుపుతారు. సంతోషాలుంటాయి. ధనలాభం కలుగుతుంది. 


కన్యారాశి


కన్యారాశి జాతకులకు బుధ గోచారంతో ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. కోరికలు పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. ఇప్పటి వరకూ ప్రేమ జీవితం, వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తొలగి..సంతోషం కలుగుతుంది.


మకర రాశి


బుధుడి గోచారంతో మకర రాశిలో ప్రవేశించడం కారణంగా..ఈ రాశి జాతకులకు అద్భుతంగా లాభాలు కలుగుతాయి. శత్రువులు పరాజితులౌతారు. వ్యాపారంలో ధనలాభముంటుంది. మీ వినమ్రత, స్వీట్ వాయిస్ కారణంగా ఇతరుల హృదయాలు గెల్చుకుంటారు. ధనలాభం కలుగుతుంది.


మీనరాశి


మీనరాశి జాతకులకు బుధుడి గోచారం కొత్త ఉద్యోగాల్ని అందిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. కష్టపడితే కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. మీపై నమ్మకం పెట్టుకోండి.


Also read: Shani Dev: ఫిబ్రవరిలో శనిదేవుడి అస్తమయం.. 35 రోజులపాటు ఈరాశులకు భారీగా డబ్బు నష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook