Mercury transit 2023: ఇవాళ కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా..
Mercury transit 2023: ఇవాళ కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. మెర్క్యూరీ రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Gochar 2023 today: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటాయి. ఈరోజు అంటే జూలై 08న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు విద్య, మేధస్సు, కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. ఏ వ్యక్తి జాతకంలో మెర్క్యూరీ శుభస్థానంలో ఉంటాడో వారు శుభఫలితాలను పొందుతారు. కర్కాటక రాశిలో బుధుడి సంచారం వల్ల మూడు రాశులవారికి అదృష్టం కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధ సంచారం ఈ 3 రాశులకు వరం
ధనస్సు
ధనుస్సు రాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశిలో బుధుడు సంచారం వల్ల ఈరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించబడతాయి. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ లక్ కలిసి వస్తుంది.
కర్కాటకం
ఇదే రాశిలోకి మెర్క్యూరీ ప్రవేశించాడు. బుధుడి సంచారం ఈ రాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. మీ కృష్టికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు మీ బిజినెస్ విస్తరిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది.
కుంభం
కర్కాటక రాశిలోకి బుధుడి ప్రవేశంతో కుంభ రాశి వారికి మంచి రోజులు మెుదలయ్యాయి. మెర్క్యూరీ సంచారం వల్ల మీ సంపదతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఎందులోనైనా పెట్టుబడి పెట్టడానికి ఇదే మచి సమయం. ఈసమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
Also Read: Shukra Gochar 2023: శుక్రుడి సంచారంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook