Budh transit 2023: మకరంలో బుధ గోచారం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..
Budh Dev Transit In Makar: పంచాంగం ప్రకారం, బుధ గ్రహం మకరరాశిలో సంచరించబోతోంది. మెర్క్యురీ యొక్క ఈ సంచారం 3 రాశులవారికి బంపర్ ప్రయోజనాలను అందించనుంది.
Budh Dev Transit In Makar: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు తమ రాశులను నిర్ణీత వ్యవధిలో మార్చుకుంటాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. ఈ గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి సానుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. ఫిబ్రవరి 07న బుధుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. మకరంలో మెర్క్యూరీ సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మకర రాశిచక్రం
మెర్క్యురీ యొక్క సంచారం మీకు లాభాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి లగ్న గృహంలో జరగబోతోంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బును ఆదా చేస్తారు. పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలను పొందుతారు. మీ కెరీర్‌లో మంచి ఆఫర్‌లను దక్కించుకుంటారు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
కన్య రాశిచక్రం
మెర్క్యురీ యొక్క రాశి మార్పు కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. లవ్ లైఫ్ బాగుంటుంది. విద్యార్థులకు ఈ సమయం అద్బుతంగా ఉంటుంది. మీరు ఏదైనా ఉన్నత విద్యాసంస్థల్లో సీటు పొందే అవకాశం ఉంది.
తులా రాశిచక్రం
మెర్క్యురీ యొక్క సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో బుధ సంచారం జరగబోతోంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్యాపారుస్తులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.
Also Read: Grah Gochar 2023: ఫిబ్రవరిలో 3 పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ రాశులకు గుడ్ న్యూస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook