Rajyoga: `భద్ర మహాపురుష రాజయోగం` చేయబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..
Budh Gochar June 2023: ఈ నెలలో గ్రహాల యువరాజైన బుధుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా అరుదైన `భద్ర మహాపురుష రాజయోగం` ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Benefits of Bhadra Purush Rajyog: నవగ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతడిని తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. గ్రహాల రాకుమారుడిగా పిలువబడే బుధుడు జూన్ 24న మిథునరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి చాలా లాభాలను ఇవ్వబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్య రాశి
మిథున రాశిలో మెర్క్యూరీ సంచారం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్‌తో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు ఊహించని ధనలాభం పొందుతారు.
ధనుస్సు రాశి
భద్ర మహాపురుష రాజయోగం ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇవ్వనుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఫారిన్ వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది.
Also Read: Rahu Gochar 2023: వచ్చే 153 రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. మీరున్నారా?
మిధునరాశి
భద్ర మహాపురుష రాజయోగం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి దక్కుతుంది. మీరు ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Budh Surya Yuti 2023: బుధాదిత్య రాజయోగంతో ఈ 3 రాశులకు మహార్దశ... మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook