Mercury transit in leo 2023: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మూడు రోజుల కిందట అంటే జూలై 25న బుధుడు సింహరాశిలోకి (Mercury transit in leo 2023) ప్రవేశించాడు. దీని కారణంగా అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆగస్టు 24న అదే రాశిలో మెర్య్కూరీ తిరోగమనం చేస్తాడు. సెప్టెంబరు 16న మార్గంలోకి వస్తాడు. అనంతరం అక్టోబరు 1న బుధుడు సింహరాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో బుధుడి సంచారం ఏయే రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ రాశులకు వరం
సింహ రాశి - ఇదే రాశిలో బుధ సంచారం జరిగింది. దీంతో సింహరాశి వారు కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మీ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
మిథునరాశి - సింహరాశిలో మెర్క్యూరీ సంచారం మిథునరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. పరిశోధన రంగంలో ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. 


Also Read: Sun transit August 2023: సింహరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు.. అదృష్టమంటే ఈ మూడు రాశులిదే..!


ధనుస్సు - మెర్క్యూరీ యొక్క రాశి మార్పు ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి దానిని త్వరగా పూర్తిచేస్తారు.
తులారాశి - బుధ కదలిక తులారాశి వారికి కలిసి వస్తుంది. మెర్క్యూరీ రాశి మార్పు మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. తద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. రుణ విముక్తి నుండి బయటపడతారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. 


Also Read: Venus set 2023: ఆగస్టు 3న అస్తమించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook